Wednesday , July 24 2024

నాగర్ కర్నూల్ ఎంపీ స్థానానికి 26 మంది అభ్యర్థులు దరఖాస్తులు.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (ఫిబ్రవరి 18):

నాగర్ కర్నూల్ జిల్లా పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థులుగా 26 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి కో-ఆర్డినేటర్ గా ఉండటంతో పార్లమెంట్ సీటు కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేయడంలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే పలువురు అభ్యర్థుల ప్రచారంలో నిమగ్నమైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చెబుతుందో అని పార్టీ శ్రేణులు ఎదురుచూస్తున్నారు. ఆశావాకులు అధిష్టానం ఆదేశాల మేరకు నడుచుకుంటామని, ఎవరికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని వారు అంటున్నారు.