Monday , September 16 2024

పోలియో చుక్కల కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎంపీపీ యార సుజాత-సంజీవరెడ్డి

తెలంగాణ కెరటం, మొగుళ్ళ పల్లి మండలం ప్రతినిది,

మార్చి,3

జయ జయ శంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళ పల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణంలో పోలియో చుక్కల కేంద్రాన్ని ఎంపీపీ యార సుజాత-సంజీవరెడ్డి, జడ్పిటిసి జోరుక సదయ్య, మండల వైద్యాధికారిణి డాక్టర్ పోరండ్ల నాగరాణి, మొగుళ్ళపల్లి మాజీ సర్పంచ్ మోటే ధర్మారావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు ఎర్రబెల్లి పున్నం చందర్ రావులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..పుట్టిన పాప నుండి ఐదు సంవత్సరాల పిల్లల వరకు పోలియో చుక్కలు వేయించి..అంగవైకల్యం లేని సమాజాన్ని నిర్మిద్దామని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. రెండు చుక్కలు..నిండు జీవితానికి భరోసానిస్తాయని, తల్లిదండ్రులు తప్పనిసరిగా పిల్లలందరికీ పల్స్ పోలియో చుక్కలు వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ వెంకటస్వామి, హెల్త్ అసిస్టెంట్ బిక్షపతి, అంగన్వాడీ టీచర్ బత్తిని అనిత, ఆశా వర్కర్ స్వప్న తదితరులు పాల్గొన్నారు.