–మొగుళ్ళపల్లి ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్
తెలంగాణ కెరటం, మొగుళ్ళ పల్లి మండలం ప్రతినిది,
ఫిబ్రవరి,26
సైబర్ నేరగాళ్లు ప్రముఖ బ్యాంకుల పేరుతో వాట్సాప్ గ్రూపులను క్రియేట్ చేసి..గ్రూప్ సభ్యులుగా చేర్చుకొని..మాయ చేస్తున్నారని, అలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని మొగుళ్ళపల్లి ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్ ప్రజలకు సూచించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సాంకేతికత పెరుగుతున్న కొద్దీ ఆన్లైన్ మోసాలు ఎక్కువవుతున్నాయని, ఒకప్పుడు దీనికి అమాయక, నిరక్షరాస్య ప్రజలు మాత్రమే బలయ్యేవారని, కానీ ఇప్పుడు మాత్రం అన్ని తెలిసిన వారు కూడా బురిడీ గాళ్ళ మాయలో చిక్కుకుంటున్నారని వాపోయారు. ఫేక్ వాట్సాప్, ఫేస్ బుక్ ల ద్వారా వచ్చే కాల్స్, మెస్సేజీలకు స్పందించి బ్యాంక్ లావాదేవీల సమాచారం ఇస్తే..నిలువ దోపిడీకి గురవ్వక తప్పదన్నారు. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కకుండా ప్రజలు ఫేక్ వాట్సాప్, ఫేస్ బుక్ అకౌంట్లకు దూరంగా ఉండాలని, ఫేక్ గ్రూప్స్ అకౌంట్స్ ల్లో మీరు ఉన్నట్లయితే వెంటనే వైదొలిగి అధికారిక సోషల్ అకౌంట్లను మాత్రమే ఫాలో అవ్వాలని ఆయన ప్రజలకు సూచించారు.