తెలంగాణ కెరటం,మొగుళ్ళ పల్లి మండలం ప్రతినిది,
ఫిబ్రవరి,26
కూతురు మధుకర్ (46) మద్యంను అధికంగా సేవించి..మద్యం మత్తులో గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని ఇప్పలపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ తీగల మాధవ్ కథనం ప్రకారం మృతుడు కూతురు మధుకర్ గత కొంతకాలంగా మధ్యానికి బానిసై..తరచుగా మద్యం త్యాగివస్తూ..ఇంట్లోని కుటుంబ సభ్యులతో ఎలాంటి కారణం లేకుండానే గొడవలు చేసేవాడని, గతంలో 2,3 సార్లు మద్యం తాగిన మత్తులో మందు తాగి చనిపోతానంటూ బెదిరించేవాడని, ఈ క్రమంలో ఆదివారం రాత్రి 7:30 గంటలకు మద్యం సేవించిన మధుకర్ ఇంటికి వచ్చి.. మద్యం మత్తులో అకారణంగానే ఇంట్లో గొడవ చేసి గడ్డి మందు తాగాడని, చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు చిట్యాల సివిల్ ఆస్పత్రికి తరలించే లోపే రాత్రి 09:00 గంటలకు చనిపోయాడని, మృతుడి కుమారుడు కూతురు రాహుల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మాధవ్ గౌడ్ తెలిపారు.