Saturday , October 12 2024

ప్రమాదవశాత్తు యువకుడి మృతి

తెలంగాణ కెరటం, మొగుళ్ళ పల్లి మండలం ప్రతినిది,

ఫిబ్రవరి,25

సామల ప్రశాంత్ (25) అనే యువకుడు ప్రమాదవశాత్తు మృతి చెందిన సంఘటన జయ శంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని బద్దంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం మృతుడు సామల ప్రశాంత్ గత కొంతకాలంగా కండ నరాల బలహీనతల వలన తన కాళ్లు, చేతులు సరిగా పనిచేయలేకపోతున్నాయని, కానీ ఆదివారం ఉదయం సుమారు 10: 45 నిమిషాలకు తన ఇంటి వద్ద ఉన్న నల్ల నీళ్లు పట్టడానికి టబ్ దగ్గరికి వెళ్లి..ప్రమాదవశాత్తు టబ్ లోని నీటిలో పడి చనిపోయాడని, మృతుడి తల్లి సామల వనమాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్ తెలిపారు.