Wednesday , July 24 2024

జాతర నిర్వహణ సక్సెస్ లో ఎస్ ఐ తీగల మాధవ్ గౌడ్ సేవలు ప్రశంసనీయం

తెలంగాణ కెరటం, మొగుళ్ళ పల్లి మండలం ప్రతినిది,
ఫిబ్రవరి 25,

జయ శంకర్ భూపాలపల్లి జిల్లా ముల్కలపల్లి-మొగుళ్ళపల్లి మినీ మేడారం జాతర సక్సెస్ లో ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్ సేవలు ప్రశంసనీయమని, విధి నిర్వహణలో ఆయన జాతర సజావుగా సాగేటట్లు చేసిన కృషి ఎనలేనిదని భక్తులు పేర్కొంటున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో..భక్తులు వనదేవతలైన శ్రీ సమ్మక్క-సారలమ్మను దర్శించుకునేందుకు చేసిన సేవలు మరువలేనివని, ఈనెల 21 నుంచి 24 వరకు జరిగిన మినీ మేడారం జాతరలో ఎలాంటి గొడవలు జరగకుండా..ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా..తగు జాగ్రత్తలను తీసుకొని పలువురి ప్రశంసలు అదునుకుంటున్నారు. ఆయన మినీ మేడారం జాతరను సక్సెస్ చేసిన తీరు పట్ల ప్రజా ప్రతినిధులు, అధికారులు, భక్తులు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్ మాట్లాడారు. మినీ మేడారంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులకు సహకరించిన భక్తజనానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.