తెలంగాణ కెరటం, మొగుళ్ళ పల్లి మండలం ప్రతినిది,
మార్చి,23
రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు భత్తు ల రమేష్ బాబు ఆదేశాల మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి డివిజన్ అధ్యక్షునిగా సుదమల్ల కిషన్ ను నియమించినట్లు జిల్లా అధ్యక్షలు ఎల్ల స్వామి గౌడ్ ప్రధాన కార్యదర్శి నిమ్మల భద్రయ్య నియమించినట్లు తెలిపారు ఈ సందర్భంగా మొగుళ్లపల్లి మండల వేములపల్లి గ్రామానికి చెందిన డీలర్ సుధమల్ల కిషన్ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నన్ను భూపాలపల్లిడివిజన్ అధ్యక్షులుగా నియమించినందుకు నా నియమకానికి కృషిచేసిన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం మాట్లాడుతూ రేషన్ షాపు డీలర్ల సంక్షేమ సంఘం కోసం నిరంతరం మన యొక్క హక్కుల్ని సాధించుకోవడం కోసం నిరంతరం పోరాటం చేస్తానని నా వంతు బాధ్యతను నిర్వర్తిస్తానని నాపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించినందుకు నా శాయ శక్తుల కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు.