Saturday , October 12 2024

మాక్ పోలింగ్ తో విద్యార్థులకు అవగాహన

తెలంగాణ కెరటం, మొగుళ్ళ పల్లి మండలం ప్రతినిది,
మార్చి,15
జయ శంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళ పల్లి మండలంలోని కొర్కిశాల మోడల్ స్కూల్లో మాక్ పోలింగ్ నిర్వహించి..విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగిందని పాఠశాల ప్రిన్సిపల్ హైమావతి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఎన్నికల సరళిలో పాల్గొన్న విద్యార్థులకు భవిష్యత్తులో ఓటు హక్కును వినియోగించుకుని మంచి ఆదర్శవంతమైన ప్రజా, ప్రతినిధులను ఎన్నుకోవచ్చని మాక్ పోలింగ్ ద్వారా అవగాహన కల్పించడం జరిగిందన్నారు. విద్యార్థులు, యువకులు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీగా, నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఈ మాక్ పోలింగ్ అవగాహన కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జి విక్రమ్, వై దేవేందర్, మహేష్, రాకేష్ విద్యార్థులు పాల్గొన్నారు.