Wednesday , July 24 2024

శ్రీ ఏడుపాయల దుర్గామాతను దర్శనం చేసుకున్న ఎమ్మెల్యే

శ్రీ ఏడుపాయల దుర్గామాతను దర్శనం చేసుకున్న ఎమ్మెల్యే

తెలంగాణ కేరాటం కొల్చారం ప్రతినిధి డిసెంబర్

మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని వన దుర్గ భవాని దేవాలయాలకు విచ్చేసిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఏడుపాయల దుర్గామాతను దర్శనం చేసుకోవడం జరిగింది. మదన్ రెడ్డి, ఎమ్మెల్యే సునీత రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు బిఆర్ఎస్ కార్యకర్తలు నేను ఎమ్మెల్యేగా గెలవాలని మొక్కుకోవడం జరిగింది. బిఆర్ఎస్ కార్యకర్తలు నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వాళ్లు మొక్కులు కొంతమంది కార్యకర్తలు యాదగిరిగుట్ట మరి కొంతమంది తిరుపతి మొక్కులు తీర్చుకోవడం జరిగింది. ఇంకొంతమంది కార్యకర్తలు ఈరోజు శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని దగ్గర 150 కొబ్బరికాయలతో మొక్కులు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బుజరంపేట్ సర్పంచ్ వనజ శ్యాంసుందర్. ఎంపీటీసీ సత్తయ్య, కాంట్రాక్టర్ లింగం, ఉప సర్పంచ్ సాయిలు అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, మాజీ ఎంపిటిసి శ్రీనివాస్, కౌడిపల్లి మండల అధ్యక్షుడు రామా గౌడ్, జడ్పిటిసి కవిత అమర్ సింగ్, ఎంపీపీ రాజు నాయక్, కొల్చారం మేఘమాల సంతోష్ కుమార్ బిఆర్ఎస్ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.