Monday , July 22 2024

ఎం ఈ ఓ కార్యాలయం లోనోట్ బుక్స్ పంపిణీ చేసిన ఎంపీపీ, జడ్పిటిసి,  సర్పంచ్

తెలంగాణ కెరటం 28 సూర్యాపేట జిల్లా ప్రతినిధి 

మఠంపల్లి మండల విద్యా వనరుల కేంద్రంలో బుధవారం ఎంపీపీ మూడవత్ పార్వతి కొండ నాయక్, జడ్పిటిసి జగన్ నాయక్ ,స్థానిక సర్పంచ్ మన్నెం శ్రీనివాస్ రెడ్డి ,ఎంఈఓ ఛత్రు నాయక్ ల చేతుల మీదుగా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత నోట్ బుక్స్ లను మండలంలోని అన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు అందించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఎంపీడీవో జానకి రాములు, సర్పంచులు, ఎంపీటీసీలు ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.