Sunday , May 26 2024

కె ఎన్ ఆర్ కాలనీ నూతన కార్యవర్గం ఎన్నిక.

జవహర్ నగర్, ఏప్రిల్ 14 (తెలంగాణ కెరటం)

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాప్రా మండలంలోని స్థానిక జవహర్ నగర్ కేఎన్ఆర్ కాలనీ నూతన కార్యవర్గం నేడు పూర్తి కాలనీవాసుల సమక్షంలో ఏకగ్రీవంగా కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ నూతన కమిటీ కాలపరిమితి ఒక సంవత్సరంగా ఉంటుందని అధ్యక్ష కార్యదర్శులు తెలిపారు. ఈ సందర్భంగా బాశెట్టి వీరేశం కాలనీ అధ్యక్షులు మాట్లాడుతూ.. నాపై నమ్మకం ఉంచి అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు కాలనీ ప్రజలకు మరియు కార్యవర్గ సభ్యులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. నాకు ఈ యొక్క పదవి మరింత బాధ్యతను కాలనీకి సేవ చేసుకునేందుకు అవకాశం కల్పించిందని అన్నారు. నేను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి కాలనీ సమస్యలను వెంటవెంటనే పరిష్కార దిశగా పనిచేస్తానని తెలిపారు. అంతేకాకుండా అభివృద్ధి పనులలో కాలనీకి కావలసిన వసతులను మెరుగుపరుస్తానని అన్నారు. నూతన కమిటి గౌరవ అధ్యక్షులుగా నంగునూరి ఆశోక్, రమేష్ చారి, కాలనీ అధ్యక్షులుగా బాశెట్టి వీరేశం, ఉపాద్యక్షులుగా పందిరి శ్రీనివాసలు, బి. మోహన్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కందుల శంకర్, జనరల్ సెక్రటరీగా చిలువురి రాము, కోశాధికారిగా కూటికంటి వెంకటేశ్వర్లు, సంయుక్త కార్యదర్శిగా శేఖర్, గోపాల్, కార్యవర్గ సభ్యులుగా రాజూరం అబ్బుల్లా, డి.రాములు, విగ్నేష్, బాపురెడ్డి, పంజుల సాయి, జగదీశ్వర్, చంద్ర మౌళి, యాదగిరి చారి, రమేష్, జమ్మయ్య. ముఖ్య సలహదారులుగా పి. రాజు గౌడ్, కె.రాజు లను ఎన్నుకోవడం జరిగింది.