Tuesday , July 16 2024

ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133 వ జయంతి వేడుకలు

మేడ్చల్ మల్కాజ్గిరి, ఏప్రిల్ 14 (తెలంగాణ కెరటం)

భారత రాజ్యాంగ సృష్టికర్త, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపెరగని కృషిచేసిన మహానుభావుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ ప్రజావాణి హాల్ లో జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ జ్యోతి ప్రజ్వలన చేసి, అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ రామ్మోహన్ రావు, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి వినోద్ కుమార్, జిల్లా షెడ్యూల్ కులాల సహకార సంస్థ అధికారి బాలాజీ, జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ అధికారి బలరాం కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.