Friday , November 15 2024

బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసిన నాయకులు.

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు..

తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి జనవరి 1:

మెదక్,రామాయంపేట. సోమవారం సెక్రటేరియట్ లో రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి, బీసీ సంక్షేమ శాఖకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్, ఆర్టీసీకి సంబంధించిన సమస్యల గురించి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఆధ్వర్యంలో చర్చించిన టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రామచంద్ర గౌడ్, రామాయంపేట మండల కేంద్రంలో ఎక్స్ ప్రెస్ బస్టాండ్, బస్ డిపో ఏర్పాటు కోసం కోరగా సానుకూలంగా స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్. త్వరలోనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చిన రవాణా శాఖ మంత్రి. ఈ కార్యక్రమంలో శంకరంపేట మండల మాజీ అధ్యక్షులు, ఎంపీపీ తాళ్ల పండరి గౌడ్ పాల్గొన్నారు.