Tuesday , July 16 2024

అవుసులపల్లి చెక్ డ్యామ్ సందర్శించిన జడ్పిటిసి సభ్యుడు పంజా విజయ్ కుమార్.

తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి మే 20:

మెదక్ మండలం అవుసులపల్లి గ్రామంలో చెక్ డ్యాం మరమ్మత్తులు సరిగ్గా చేయకపోవడం వల్ల నాయకుల కాంట్రాక్టర్ల లోపం వల్ల రైతులు పంటలు వేయకపోవడం డ్యాములో ఒక నీటి చుక్క లేకపోవడం వల్ల రైతులు కన్నీటి పాలవుతున్నారని నిజాంపేట జడ్పిటిసి సభ్యుడు మెదక్ అసెంబ్లీ బిజెపి ఇంఛార్జి పంజ.విజయ్ కుమార్ అన్నారు.ఆయన మాట్లాడుతూ రైతులతో చెక్ డ్యామ్ దగ్గరికి వెళ్లి వారిని ఓదార్చి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డిఎస్సి తో మాట్లాడడం జరిగింది.రైతుల పక్షాన నేను మీకు అండగా ఉన్నానని భరోసానిచ్చి మరమ్మత్తులు జరిగే తట్టు చూస్తానని చెప్పారు.ఈ విషయంలో రైతులు సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కల్కి నాగరాజు, ప్రధాన కార్యదర్శి సుంకోజి రాజు, ఆకుల రాము, అంకం శ్రీనివాస్, అల్లం మధు, ఉపేందర్, వేణుగోపాల్ రావు,కృష్ణారెడ్డి,దుర్గాప్రసాద్, చింతల శ్రీనివాస్,శంకర్ గౌడ్, రైతులు, గ్రామస్తులు నాయకులు పాల్గొన్నారు.