Thursday , November 7 2024

ఏడుపాయల జాతర బందోబస్తు కు అన్ని రకాల ఏర్పాటు.

జిల్లా ఎస్పీ డాక్టర్ బాలస్వామి .

తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి మార్చి 7:

జిల్లా ఎస్పీ డాక్టర్. బాలస్వామి పర్యవేక్షణలో ఏడుపాయల జాతర బందోబస్త్,
భక్తులు జాగ్రత్తలు పాటించాలి. జిల్లా ఎస్పీ డాక్టర్.బాలస్వామి
ఏడుపాయల జాతర యొక్క పోలీసు బందోబస్తూ సెక్యూరిటీ ఏర్పాటు జిల్లా ఎస్పీ డాక్టర్.బాలస్వామి పరిశీలించారు. జాతరలో సీసీ టీవీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేయటం జరిగిందని అన్నారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ డాక్టర్.బాలస్వామి మాట్లాడుతూ జాతర దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పటిష్టమైన పోలీసు రక్షణ బందోబస్తును ఏర్పాటు చేసినామని అన్నారు. జాతర ప్రాంగణంలో మొత్తం 65 సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరా ఏర్పాటు చేసినామని, జాతర మొత్తాన్ని సీసీటీవీ కెమెరాల పర్యవేక్షయణలో ఉంచాం అన్నారు. భక్తులు జాగ్రత్తలు పాటించాలి.జాతరకు వచ్చే భక్తులు సంతోషంగా గడపాలని అన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచాలి అని కోరినారు. అనుమానిత వస్తువులను తాకవద్దు అన్నారు, పోలీసు వారు చూపిన ప్రాంతాల్లో వాహనాలు పార్కింగ్ చేసుకోవాలి, చిన్న పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి అన్నారు, అత్యవసర సమయాల్లో పోలీసు కంట్రోల్ రూమ్ ద్వారా పోలీసు సేవలను సద్వినియోగం చేసుకోవాలి అని తెలిపినారు. క్యూ లైన్స్ పాటించాలి, బారికేడ్స్ దాటుకి రావద్దు అన్నారు. విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలిని, ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా ప్రవర్తుంచవద్దు, గొడవలు, తగాదాలు పెట్టుకోవద్దు అని అన్నారు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని, జిల్లా షీ టీం తో ప్రత్యేక నిఘా ఉంటుందని అన్నారు. సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఉత్సవాన్ని ఆనందించాలి అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్.పి డా. శ్రీ.బి.బాలస్వామి గారు మాట్లాడుతూ…. మహాశివరాత్రి సందర్భంగా ఎడుపాయల జాతరలో పటిష్టమైన బందోబస్తు వివరాలను తెలియజేస్తూ జిల్లా ఎస్.పి గారి స్వీయ పర్యవేక్షణలో ఒక అదనపు యెస్.పి గారు, డి.యెస్.పి లు /04, సిఐలు/18, ఎస్ఐలు/50, ఏఎస్ఐలు/140, కానిస్టేబుళ్లు,/208, మహిళా హెడ్ కానిస్టేబుళ్లు-మహిళా కానిస్టేబుళ్లు/,80 హోంగార్డు/130 మరియు బీడీ టీమ్స్, మొత్తం 630 మంది అధికారులు సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపినారు. మహిళ భద్రత కోసం మహిళ పోలీసు సిబ్బందిని, షీ టీమ్స్ ను, మఫ్టీ టీమ్స్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపినారు.పార్కింగ్ స్థలాలు విధులు నిర్వహిస్తున్న అధికారులు సిబ్బంది వాహనాలను ఒక క్రమపద్ధతిలో పార్కింగ్ చేయించాలని, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, కంట్రోల్ రూమ్ లో ఉండు సిబ్బంది అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని, అధికారులకు సూచించారు. మరియు బందోబస్తు సీసీ కెమెరాల నిఘా లో నిర్వహించడం జరుగుతుందని, మహాశివరాత్రి సందర్భంగా ఏడుపాయాలకు వచ్చే భక్తులు పోలీసు వారి సూచనలు సలహాలు పాటించి ప్రశాంతమైన వాతావరణంలో వనధుర్గా అమ్మవారి దర్శనం తదితర కార్యక్రమాలు ముగించుకుని వెళ్లాలని సూచించారు. భక్తులు పోలీసు వారు సూచనలు సలహాలు పాటించి పార్కింగ్ స్థలాల్లో మాత్రమే వాహనాలు పార్కు చేయాలని సూచించారు.అలాగే జాతర లో ఏదైనా ఇబ్బంది కలిగితే డయల్ 100 కి కానీ దగ్గరలో ఉన్న పోలీసు సిబ్బందికి తెలియజేయాలన్నారు. బందోబస్తును 04 సెక్టార్లుగా విభజించడం జరిగింది వేలాదిగా తరలి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటుచేయడం జరిగింది కంట్రోల్ రూంను ఏర్పాటు చేశామని ప్రతి డిపార్ట్మెంట్ కి సంబంధించిన వారు కంట్రోల్ రూంలో అందుబాటులో వుంటారని, ప్రజలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాము అని తెలిపారు, అలాగే జాతరకు వచ్చే భక్తుల వాహనాలు నిలపటానికి ప్రత్యేక పార్కింగ్ లను ఏర్పాటు చేశామని వాహానాలను పార్కింగ్ కోసం ఎంపిక చేసిన స్థలాలలోనే తమ వాహనాలను నిలుపుకొని పోలీసు సిబ్బందికి సహకరించాలని జిల్లా జిల్లా ఎస్పీ కోరారు.