-జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ రాజ్.
తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి మే 13:
పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సమాచారం త్వరిత గతిన అందించాలని సిబ్బందికి సూచించారు.స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆదివారం సిబ్బందితో మాట్లాడుతూ
రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ శాతం, ఓటర్ల హాజరు సమాచారం త్వరిత గతిన ఉన్నతస్థాయి అధికారులకు అందించాలని,ప్రతి రెండు గంటలకు ఒకసారి ఓటర్ల హాజరు, పోలింగ్ శాతం అందించి పూర్తి సమాచారాన్ని ఆన్లైన్ లో నమోదు చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వేంకటేశ్వర్లు, ఏవో.యునాస్,ఎలక్షన్ సూపరిండెంట్ హర్దీప్ సింగ్, ఈడియం సందీప్ తదితరులు పాల్గొన్నారు.