Monday , September 16 2024

ఈవీఎంల కమిషనింగ్‌ పకడ్బందీగా చేపట్టాలి.

జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ రాజ్.

తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి మే 5:

ఈ నెల 13 న జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కోసం ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు.
బీవీఆర్ఐటి నర్సాపూర్ కళాశాలలో చేపడుతున్న ఈవీఎంల కమిషనింగ్‌ ప్రక్రియను జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు కమిషనింగ్‌ ప్రక్రియను ఎలాంటి పొరపాట్లు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు.ఈవీఎంలపై సీరియల్‌ నెంబర్లు,అభ్యర్థుల పేర్లు,వారికి కేటాయించిన చిహ్నాల ఏర్పాటు పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. కమిషనింగ్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మాక్‌ పోలింగ్‌ నిర్వహించి,ఈవీఎంల పనితీరు పరిశీలించాలన్నారు.
అలాగే స్ట్రాంగ్‌రూమ్‌ నిర్వహణ వివరాలను ఏఆర్‌ఓలను అడిగి తెలుసుకున్నారు.
నర్సాపూర్ ఆర్డీఓ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ పరిశీలన.
పార్లమెంట్ ఎన్నికల నియమావళి అమలులో భాగంగా ఆదివారం నర్సాపూర్ ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సరళిని పరిశీలించారు. ఓటు వేయడానికి వచ్చే ప్రతి పౌరునికి అధికారులు సహాయసహకారాలు అందించాలన్నారు.
కలెక్టర్ వెంట,ఎన్నికల అధికారులు,సిబ్బంది తదితరులు ఉన్నారు.