Monday , July 22 2024

నేటి దళిత సమ్మేళనం జయప్రదం చేయండి.

కొండాపురం జగన్.

తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి మే 4:

మెదక్ పట్టణం మాయా గార్డెన్ లో ఆదివారం 5న సాయంత్రం 5 గంటలకు నిర్వహించ తలపెట్టిన మెదక్ పార్లమెంట్ స్థాయి దళిత సమ్మేళనాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యఅతిథిగా కొల్లార్ (కర్ణాటక) ఎంపీ మునిస్వామి, పార్లమెంట్ బిజెపి అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు, పార్లమెంట్ కోఆర్డినేటర్ కొప్పు భాష విచ్చేయుచున్నారు దళితులు, దళిత మేధావులు, దళిత నాయకులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా బిజెపి రాష్ట్ర ఎస్సీ మోర్చా మాజీ ప్రధాన కార్యదర్శి కొండాపురం జగన్ పిలుపునివ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిజేపి మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్,మెదక్ పార్లమెంట్ ఎస్సీ మోర్చా ఇంచార్జ్ మంకిడి స్వామి, మెదక్ జిల్లా దళిత మోర్చా అధ్యక్షుడు యాదగిరి, దళిత మోర్చా నాయకులు వరప్రసాద్, సురేష్, నత్తి శివకుమార్ పాల్గొనడం జరిగింది.