ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలి .
జిల్లా సాధారణ పరిశీలకుడు సమీర్ మాధవ్ కుర్కోటి.
తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి ఏప్రిల్ 28:
సాధారణ ఎన్నికలు 2024 ఎన్నికల నియమావళిలో బాగంగా అదివారం ఐ డి ఓ సి లోని సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి /జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లాఎస్పీడాక్టర్.బాలస్వామి, జిల్లాఎన్నికల నోడల్ అధికారులు,పోలీస్ అధికారులుతో ఎన్నికల ఏర్పాట్లు పై సమీక్ష నిర్వహించారు.ఈ సమీక్ష లో కేంద్ర ఎన్నిక సంఘం నియమించిన జిల్లా సాధారణ పరిశీలకుడు సమీర్ మాధవ్ కుర్కోటి,వ్యయ పరిశీలకుడు సునీల్ కుమార్ రాజ్వాన్షి ,జిల్లా పోలీస్ పరిశీలకుడు డి ఐ జి రామేశ్వర్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల నియమావళి అమలులో భాగంగా ఎన్నిక ల పక్రీయ, ఎన్నికల ఏర్పాట్లను ,జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ , జిల్లా ఎస్పీ ,పరిశీలకులకు జిల్లా ఎన్నికలఏర్పాట్లను వివరించారు.జిల్లా లో ఉన్న పోలింగ్ కేంద్రాల,మండలాల వారీగా,మున్సిపాలిటీ లా వారీగా ,గ్రామాల వారీగా, సమస్యాత్మకం గా ఉన్న పోలింగ్ కేంద్రాలు,జిల్లా జనాభా ప్రకారం,ఓటర్లు వివరాలు,పోటి చేసే రాజకీయ పార్టీలు, స్తీ),పురుష నిష్పత్తి, థర్డ్ జెండర్ జనాభా,వయస్సు ల వారీగా ఉన్న ఓటర్ల వివరాలు,ఎపిక్ కార్డ్ వివరాలు, జిల్లా లో 100 శాతం ఎపిక్ కార్డ్ లు పూర్తి వివరాలు,ఓటర్ స్లీప్ పంపిణీ , సి విజిల్,1950 పిర్యాదులు,పోలింగ్ కేంద్రాల్లో ఉన్న వసతులు, సెక్టర్ అధికారులు ,రూట్ అధికారుల వివరాలు, ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు,పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్ట్oగ్ , ఈవీఎం, వి వి పి ఎ టి ల స్టామర్ద్యం , డిస్ట్రిబ్యూషన్ , రిసెప్షన్, కౌంటింగ్ సెంటర్ లో ఏర్పాట్లు,అధికారుల వివరాలు,ప్రత్యేక టీమ్ లు ,పోస్టల్ బ్యాలెట్,ఎంసీఎంసీ లో వచ్చిన పిర్యాదులు,పరిష్కారాలు ,
ఎన్నికల వస్తు సామాగ్రి,వీల్ చైర్స్, పిడబ్ల్యుడి వారికి,రవాణా,స్వీప్ అధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలు,సీజ్ చేసిన నగదు,మద్యం ఇతర వస్తు సామాగ్రి వివరాలు, సువిదా ఆప్ లో వచ్చిన అనుమతులు , ఇతర వివరాల వంటి కార్యక్రమాలను పరిశీలకులకు వివరించారు.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పరిశీలకులకు ,జిల్లాలో ఏర్పాటు చేసిన చేక్ పోస్ట్ వివరాలు ,సీజ్ చేసిన వివరాలు,కేస్ నమోదు వివరాలు,బైండోవర్ చేసిన వివరాలు వివరించారు.
ఈ సందర్బముగా కేంద్ర ఎన్నిక సంఘం నియమించిన జిల్లా సాధారణ పరిశీలకుడు మాట్లాడుతూ కేంద్ర ,రాష్ట) ప్రభుత్వ ఉద్యోగులు ఈసీఐ పరిధి లో పనిచేయాలని, అన్ని శాఖల టీమ్ లు సమన్వయంతో కలసి పనిచేయాలని, ఎఫ్ ఎస్ టి (ఫ్లయింగ్ సర్విలియాన్స్ టీమ్), ఎస్ ఎస్ టి( స్టాటస్టిక్ సెర్విలియాన్స్ టీమ్) వి ఎస్ టి , ( వీడియో సర్విలీయన్స్ టీమ్) వివిటి ( వీడియో వ్యూవింగ్ టీమ్ ),వివిధ టీమ్ లా అధికారులు సమన్వయం తో పని చేయాలని, ప్రజాస్వామ్యం లో ఎన్నికలు చాలా గొప్పవి అని ఎన్నికలు ప్రశాంతంగా జరపాలని ,ప్రతి ఓటరుకు ఓటరు స్లిప్పు అందేలా ఖచ్చితమైన కార్యాచరణను అమలు చేయాలని తెలిపారు. ఎల్పోలింగ్ కేంద్రాలలో వెబ్ క్యాస్టింగ్ నిర్వహణ ఏర్పాటు పూర్తిచేయాలి తెలిపారు . ఓటరు స్లిప్పుల పంపిణీ పర్యవేక్షణ కోసం,ఓటరు స్లిప్పుల పంపిణీ అంశంలో ఫిర్యాదులు ఉంటే వాటి పరిష్కారానికి నోడల్ అధికారిని నియమించాలని తెలిపారు.జిల్లా వ్యయ పరిశీలకుడు మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధి అనుమతి తోనే ప్రచార సామాగ్రి రవాణా చేయాలని , అధికారులు ఏదైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవాలని, పోటీ చేసే అభ్యర్థి ఖర్చు నమోదు చేయాలని, వీడియో కెమెరా లో రికార్డ్ చేయాలని , ప్రతి సంఘటననాను వీడియో ,కెమెరా లో రికార్డ్ చేయాలని, ఓటర్ కు ఎలాంటి సమస్య రాకుండా చూడాలని ,అధికారులు ఓటర్ ల తో ఎటువంటి వాదనలు చేయాకుడదని, వివిధ రకాల టీమ్ లు అన్ని ప్రతి రోజు ప్రజా సమావేశాలను గమనించాలని, అన్నారు. జిల్లా పోలీస్ పరిశీలకుడు మాట్లాడుతూ పోలీస్ శాఖ ఎన్నికల విధులను సమర్థవంతగా నిర్వహించాలని,ఎన్నికల్లో పోలీస్ పాత్ర చాలా గొప్పదని,ప్రజలకు పోలీస్ లు మంచి ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణచేయాలని,సమాజానికి మంచి సందేశం ఇవ్వలను,పోలీస్ ఇతర శాఖల మధ్య సమన్వయం తో ఉండాలని,సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో భద్రత పెంచాలన్నారు.ఈ కార్యక్రమం లో సిద్దిపేట ఎస్పీ అనురాధ, సంగారెడ్డి ఎస్పీ రూపేష్, అదనపు కలెక్టరు వేంకటేశ్వర్లు, సిద్దిపేట అదనపు కలెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి , గరిమ అగర్వాల్ ఎన్నికల నోడల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.