Wednesday , July 24 2024

మా సంకల్పం వికసిత భారతం.

బిజెపి సీనియర్ నాయకుడు శంకర్ గౌడ్.

తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి ఏప్రిల్ 28:

మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని 2 వ వార్డు గోల్పర్తి గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఇంటింటికి బిజెపి ప్రచారం నిర్వహించడం జరిగింది. ప్రచారంలో మా గోల్పర్తి గ్రామాన్ని పట్టించుకునే వాళ్ళు లేరు. ఈ బి ఆర్ ఎస్ పార్టీ ఓల్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చేస్తలేరు,
తెలంగాణను ఆగమాగం చేస్తున్నారు. ఉచితాలు, మోసపూరిత హామీలతో ప్రజలను మోసం చేస్తూ అధికారం లోకి వచ్చిన తర్వాత ఈ రెండు పార్టీలు ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి అటు రైతులను, నిరుద్యోగులను, మహిళలను మరియు నాణ్యమైన విద్యా, వైద్యం పైన అభివృద్ది పైన ప్రభుత్వం దృష్టికి పెట్టక ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయి. మన ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గడిచిన 10 ఏళ్లలో లక్షల కోట్ల నిధులు తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి కోసం ఇచ్చిన ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం. నిజమైన దేశభక్తి, జాతీయ భావాలు ఉన్న ప్రతి పౌరుడు నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి గా ఉండాలని 140 కోట్ల మంది ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో మన మెదక్ పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మాధవనేని రఘునందన్ రావుని భారీ మెజారిటీతో గెలిపించాలని రామాయంపేట పట్టణ ప్రజలను కోరుతున్నాము.