Sunday , May 26 2024

గోల్పర్తి గ్రామంలో రఘునందన్ రావుకు మద్దతుగా ఇంటింటా ప్రచారం.

బిజెపి మండల అధ్యక్షుడు బ్రహ్మయ్య గారి భానుచందర్.

తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి ఏప్రిల్ 28:

మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని గోల్పర్తి గ్రామంలో ఆదివారం మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు కు మద్దతుగా రామాయంపేట పట్టణ బిజెపి అధ్యక్షుడు దమ్మయ్య గారి భానుచందర్ ఆధ్వర్యంలో బిజెపి నాయకులు గోల్పర్తి 7వ వార్డు బూత్ నెంబర్ 88 లో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా భానుచందర్ మాట్లాడుతూ దేశంలో మోడీ చేసిన సంక్షేమ పథకాలను ప్రజలు ఆకట్టుకొని మూడోసారి మోడీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని తెలిపారు.దేశంలో మోడీ చేసిన అభివృద్ధి పనులు ప్రజలకు వివరించడం జరిగిందన్నారు.రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థి రఘునందన్ రావుకు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన అభ్యర్థిస్తూ ఓటర్లకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల శేఖర్, పట్టణ ప్రధాన కార్యదర్శి అవినాష్ రెడ్డి, గొల్పర్తి బూత్ అధ్యక్షుడు శ్రీకాంత్,వేలుముల రమేష్, కన్నయ్య, నరేష్, బాసం అనిల్ తదితరులు పాల్గొన్నారు.