Friday , October 4 2024

నీలం మధు ను భారీ మెజార్టీతో గెలిపించాలని హవేలీ ఘనపురం ముదిరాజ్ సంఘం నాయకులు సమావేశం అయ్యారు.

తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి ఏప్రిల్ 28:

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధును వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో లక్ష మెజార్టీతో గెలిపించాలని ముదిరాజ్ సంఘం హవేలీ గణపురం మండల ముదిరాజులు హవేలు ఘనపూర్ లో సమావేశమయ్యారు. ఆదివారం వారు ఒక వద్ద కూర్చుండి నీలం మధు లక్షల మెజార్టీతో గెలవాలని ముదిరాజులంతా ఏకం కావాలని వారు అన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఒక పేదింటి ముద్దుబిడ్డ నీలం మధు అని వారు కొనియాడారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ, మెదక్ గడ్డపై నుండి ఎంపీగా నీలం మదనను మీ బడుగు బలహీన ఆశాజ్యోతి మీ ఇంటి బిడ్డ ను భారీ మెజార్టీతో గెలిపించి ఈ దేశం కోసం ప్రాణాలు తెగించిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కనుక నీలమ్మదును మెదక్ పార్లమెంటు ప్రజలు పార్లమెంటుకు పంపించడానికి సిద్ధంగా ఉన్నారని వారన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్టి అక్షయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొనడం జరిగింది.