తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి ఏప్రిల్ 28:
మెదక్ పార్లమెంట్ పరిధి నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ లోక్ సభ ఎన్నికల సమన్వయకర్త ( కోఆర్డినేటర్ ) గా మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా మేడ్చల్ నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ సేవకుడు, ప్రముఖ సంఘ సేవకులు డాక్టర్ రొండా మల్లారెడ్డిని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపిక చేసి నియమించారు. ఈ సందర్భంగా రొండా మల్లారెడ్డి మాట్లాడుతూ ఈ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కోసం తన సేవలను గుర్తించిన ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ లు తనను నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ గా నియమించినందుకు రొండా మల్లారెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి, మహేష్ కుమార్ గౌడ్ లకు ఆదివారం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా నర్సాపూర్ నియోజకవర్గంలో అందరి నాయకులను కలుపుకొని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో సమిష్టిగా పనిచేయడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని మల్లారెడ్డి తెలియజేశారు. ఇదిలా ఉండగా
ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీని బలమైన రాజకీయ శక్తిగా తీర్చిదిద్దేందుకు ఆ పార్టీ అధిష్టానం పావులు కదుపుతోంది. గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు, యువకిశోరం,రాహుల్ గాంధీ ఆదేశాలతో టిపిసిసి అధ్యక్షులు,ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి తెలంగాణ ప్రజలకు 6 గ్యారంటీలు అమలుచేస్తామని వాగ్దానం చేశారు. ప్రజలకు ఇచ్చిన ఈ 6 గ్యారంటీ హామీలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే ఐదు గ్యారెంటీలను అమలు చేయగా,మరో గ్యారెంటీ అయిన రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీని అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధం కాగా, పార్లమెంటు ఎన్నికల కోడ్ అడ్డువచ్చి రుణమాఫీ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ ఆరో గ్యారెంటీ అమలు ఎందుకు ఆగిపోయిందో అనే విషయాన్ని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు విడమర్చి చెప్పి, వివరించాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర మొత్తం కాంగ్రెస్ నాయకగణంపై ఉన్నదని ఈ అంశాన్ని ప్రజల్లోకి చాచ్చుకుపోయేలా చేయాలని కాంగ్రెస్ ఢిల్లీ హైకమాండ్ రాష్ట్ర నేతలకు గుర్తు చేసినట్లు సమాచారం.అదేవిధంగా ఈ పార్లమెంట్ ఎన్నికలలో పార్టీలో ఎక్కడ కూడా అంతర్గత విభేదాలకు తావు లేకుండా, ఎన్నికల్లో నాయకులకు, కేడర్ కు సమన్వయ లోపం రాకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు టిపిసిసి అధ్యక్షులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమన్వయకర్తలను నియమించారు.