Sunday , May 26 2024

జిల్లాలో వందశాతం ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో వ్యాక్సిన్ వేయాలి.

జిల్లాకలెక్టర్ జిల్లా కలెక్టర్ రాజర్షి.

తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి మార్చి 3:

ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో గల పల్స్ పోలియో బూత్ లో మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ చందు నాయక్ , తో కలిసి జిల్లా కలెక్టర్ రాజర్షి షా చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం , తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నేషనల్ హెల్త్ మిషన్ కార్యక్రమం క్రింద ఈ పల్స్ పోలియో కార్యక్రమం చేపట్టినట్లు మొత్తం రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు మన జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా 75,000 మంది
5 సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో టీకాలు వేసేందుకు నెల రోజుల నుండి జిల్లా, మండల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయి టాస్క్ ఫోర్స్ సమావేశాలు నిర్వహించి జిల్లాలో గల 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 157 సబ్ హెల్త్ సెంటర్స్ పరిధిలో 457 ప్రత్యేక టీకా కేంద్రాలు ఏర్పాటు చేశామని ,అలాగే 46 రూట్లలో 20 మొబైల్ టీమ్స్ , ట్రాన్సిట్ పాయింట్స్ 20 ఏర్పాటు చేశామని చెప్పారు
ప్రతి టీకా కేంద్రంలో వైద్య ఆరోగ్య మరియు స్త్రీ, శిశు సంక్షేమశాఖకు సంబంధించిన నలుగురు సిబ్బంది ద్వారా టీకాలు వేస్తున్నామని, ఇతర రాష్ట్రాల నుండి వచ్చి జిల్లాలో వివిధ ప్రాంతాల్లో నిర్మాణ పనుల్లో ఉన్న కుటుంబాల పిల్లల కోసం ప్రత్యేక టీకా కేంద్రాలను ఏర్పాటు చేశామని, గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ లో మున్సిపల్ అధికారుల సహకారంతో పల్స్ పోలియో కార్యక్రమం పై ప్రచారం నిర్వహించామని, దేశ స్థాయిలో ప్రతి సంవత్సరం పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం మూలంగా గత పది సంవత్సరాలుగా దేశంలో ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదని, చెప్పారు
చిన్నప్పుడు మనం పోలియో టీకా వేసుకోవడం మూలంగానే ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నామని ఇదే విధమైన భవిష్యత్తును మన పిల్లలకు అందించాలని అన్నారు.
పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ప్రభుత్వం చేపట్టిన ఈ పల్స్ పోలియో కార్యక్రమంలో ఐదు సంవత్సరాల పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు.రేపు ,ఎల్లుండిఆరోగ్య సీబంది ఇంటింటికి తిరిగి తప్పిపోయిన పిల్లలను గుర్తించి పోలియో వాక్సిన్ వేయడము జరుగుతుందన్నారు.
హైరిస్క్ ఏరియాలలో ప్రతేకా బూత్ ద్యారా వాక్సిన్ వేయబడుతుంది
జరుగుతుందన్నారు.
పోలియో టీకాలు అందించిన వెంటనే పిల్లలకు మార్కింగ్ చేస్తారని ఇలా చేయడం వల్ల ప్రతి ఒక్క పిల్లలు పోలియో టీకాలు వేసుకున్నారా లేదా అనేదాన్ని గుర్తించవచ్చు అని చెప్పారు .జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, శ్రీ శిశు సంక్షేమ శాఖ విద్యాశాఖ సమన్వయంతో
ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో డి ఐ ఓ మాధురి మెడికల్ ఆఫీసర్ రఘువరన్ సంబంధిత మెడికల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.