Thursday , May 23 2024

ఎన్నికల ప్రచారంలో భాగంగా దంతెపల్లి గ్రామం లో పర్యటించిన కంఠా రెడ్డి తిరుపతి రెడ్డి.

తెలంగాణ కెరటం మెదక్ జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 28:

రామాయంపేట మండలంలోని దంతెపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం లో భాగంగా గడప గడపకు తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని మెదక్ పార్లమెంట్ బి ఆర్ ఎస్అభ్యర్థి వెంకట్ రామ రెడ్డి ని ఎంపీగా ఆశీర్వదించి పార్లమెంటుకు పంపిస్తే మెదక్ అభివృద్ధి కోసం కృషి చేస్తారని కంఠారెడ్డి తిరుపతి రెడ్డి చెప్పారు.ఈ కార్యక్రమం లో రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె. జితేందర్ గౌడ్, ఏఎంసీ మాజీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పిఎసిఎస్ చైర్మన్ అందే కొండల్ రెడ్డి , బి ఆర్ ఎస్ సీనియర్ నాయకుడు,శ్రీహరి యాదవ్ గారు, చింటు, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు
ప్రజలందరరు ఈ ఎన్నికల్లో అందరం కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తమని తెలిపారు.
కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగ ఉండేనని, కాంగ్రెస్ పాలనలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.రైతులకు,మహిళలకు, వృద్ధులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ సార్ కి మా మద్దతు ఉంటుందని, కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపిస్తామని ఆశీర్వదించారు.