Wednesday , September 18 2024

అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని వదిలిపెట్టం.

ఎంతటి వారైనా శిక్ష హారంలే.

ఎన్నికల అనంతరం దాని స్థానంలో పెద్ద అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తాం.

గ్రామంలో ఎలాంటి గొడవలు పెట్టుకోరాదు.

మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు.

తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి ఏప్రిల్ 19:

మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఆర్ వెంకటాపూర్ గ్రామంలో ఈనెల 14వ తేదీన గుర్తుతెలియని దుండగులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేయడం జరిగిందని దాన్ని వెంటనే బాగు చేయించాలని దళిత నాయకులు ధర్నా రాస్తారోకో చేయడం జరిగింది. ఈ విషయాన్ని శుక్రవారం మెదక్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వెంకటాపూర్ గ్రామానికి చేరుకొని దళిత నాయకులతో మాట్లాడారు. అంబేద్కర్ ను ధ్వంసం చేసిన ఎంతటి వారైనా వదిలి పెట్టేలేదని ఆయన అన్నారు. ఎన్నికల అనంతరం తాను మరో పెద్ద విగ్రహాన్ని ఆర్ వెంకటాపురం గ్రామంలో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ విషయంలో పోలీసులకు తాను శాంతి భద్రతల నిమిత్తం చెబుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.