తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి ఏప్రిల్ 19:
మెదక్ పార్లమెంటు స్థానానికి రెండవ రోజు శుక్రవారం నాటికి 9 మంది అభ్యర్థులు రిటర్నింగ్ అధికారికి దరఖాస్తులు సమర్పించారు. మొదటి రోజు బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు, ఇండిపెండెంట్ అభ్యర్థి చిలుకపల్లి నవీన్ కుమార్ ఒక సెట్ నామినేషన్ వేశారు. తెలంగాణ ప్రజాశక్తి పార్టీ అభ్యర్థిగా దొడ్ల వెంకటేశం రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. రెండవ రోజు నామినేషన్ లో భాగంగా ప్రజా వెలుగు పార్టీ నుండి సారా యాదగిరి గౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. బొమ్మల విజయ్ కుమార్ తన నామినేషన్ దాఖలు చేశారు. తుమ్మలపల్లి పృథ్వీరాజ్ ఇండిపెండెంట్ తన నామినేషన్ దాఖలు చేశారు. గొల్లపల్లి సాయి గౌడ్ పిరమిడ్ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుండి తన నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ తరఫున మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు, ఆవుల రాజిరెడ్డి, ఒక సెట్టు నామినేషన్ దాఖలు చేశారు. అభ్యర్థులు దాఖలు చేస్తున్న దరఖాస్తులను అధికారులు ఎప్పటికప్పుడు భద్రపరుస్తున్నారు.