Tuesday , July 16 2024

ఫిర్యాదుదారుల సమస్యలను చట్టప్రకారం పరిష్కరించాలి.

ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డాక్టర్. బాలస్వామి.

తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి ఏప్రిల్ 15:

మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ డాక్టర్ బాలస్వామి ఆద్వర్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్ట ప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు పలు సూచనలు చేయడమైనది. ఈ కార్యక్రమంలోతూప్రాన్ గ్రామం, మండలానికి చెందిన గోలి శ్రీనివాస్ మాతల్లి గోలి ప్రమీల పేరుపై 1521 సర్వే నంబర్ లోని స్క్వేర్ విస్తీర్ణంలో ఓపెన్ ప్లాట్ (అందుబాటులో ఉన్న భూమి విస్తీర్ణం 1170 చ. గజాలు) మెదక్ జిల్లా శివంపేట గ్రామం, మండలంలో ఉందని అట్టి ప్లాట్ ని శివ్వంపేట గ్రామ మాజీ సర్పంచ్ పులిమామిడి స్రవంతి భర్త పులిమామిడి నవీన్ కుమార్ అనే వ్యక్తి సంతకాలను ఫోర్జరీ చేసి శివ్వంపేట గ్రామ పంచాయతీ కార్యాలయ లెటర్ హెడ్‌లపై 05-04-2019 తేదీన రెండు యాజమాన్య ధృవీకరణ పత్రాలను సృష్టించారని కావున
నా భూమిపై నకిలీ పత్రాలు సృష్టించిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయగరలని ఫిర్యాదు చేయగాచట్టప్రకారం ఫిర్యాదికి తగిన న్యాయం చేయమని శివంపేట్ ఎస్.ఐ.కి సూచనలు చేయటం జరిగింది. అలాగే నార్సింగి గ్రామానికి చెందిన తిప్పరబోయిన సిద్ది రాములు నా కూతురు పెళ్లి చేసినందున అప్పులు అయినవని నా స్వంత స్ధలము విక్రయించుకుందామని అకుంటుండగ తిప్పరబోయిన మా పాలివారైన సత్యం అనేవ్యక్తి నాకుటంబాన్ని చంపేస్తానని బెదిరిస్తూ భూతుమాటలు తిడుతున్నాడని కావున నాకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేయగా చట్టప్రకారం ఫిర్యాదికి తగిన న్యాయం చేయమని నార్సింగ్ ఎస్.ఐ.కి సూచనలు చేయటం జరిగింది.