తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి ఏప్రిల్ 15:
మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో రఘుపతి గుట్ట పైన శ్రీ సీతారామ చంద్రుల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతిష్ట కార్యక్రమానికి గ్రామ పెద్దలు,ప్రజలు రామాయంపేట మండలం మెదక్ నియోజక వర్గం భారతీయ జనతా పార్టీ ఇన్చార్జి పంజ విజయ్ కుమార్, బిజెపి మండల అద్యక్షుడు, నాయకులు శ్రీరామచంద్రుల స్వామి వారి ఆలయ దర్శనం చేసుకొని వేదపండితుల ఆశీర్వాదం తీసుకోవటం జరిగింది.