Tuesday , July 16 2024

రామాయంపేట మండలంలో అగ్నిమాపక దినోత్సవ వారోత్సవాలు.

తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి ఏప్రిల్ 15:

ముంబాయి ఓడరేవులో 1944 ఏప్రిల్ 14న విక్టోరియా డాక్ యార్డ్ లో జరిగిన అగ్నిప్రమాదంలో విధి నిర్వహణలో ఉన్న అధికారులు,సామాన్య ప్రజలతో సహ66మంది మరణించగా, 87మంది గాయపడ్డారు.ఆ సంఘటన జ్ఞాపకంగా ప్రతి సంవత్సరం అగ్నిమాపక దినోత్సవ వారోత్సవాలు జరుపుకుంటారు.ఈ సందర్భంగా మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలోని ఎస్సీ కాలనీలో అగ్నిమాపక శాఖ ద్వారా వంట గ్యాస్ సిలిండర్ అగ్ని ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.తద్వారా అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వారికి అవగాహన కల్పిస్తూ వివరించారు.ఈ వారోత్సవాలు ఈనెల 14 నుండి 20 వరకు జరుపుతున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది నవీన్ శంకర్ బాలరాజ్ శంకర్ పాల్గొన్నారు.