మూడు గంటల పాటు నిరసన ధర్నా చేపట్టిన దళిత సంఘాల నాయకులు.
నిరసన కారులను సముదాయించిన పోలీసులు, అధికారులు.
తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి ఏప్రిల్ 15:
మెదక్ జిల్లా రామాయంపేట మండలం అర్.వెంకటాపూర్ గ్రామంలో అంబేద్కర్ జయంతిని జరుపుకొని 24 గంటలు గడవక ముందే అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంఘటన చోటు చేసుకుంది.వెంకటాపూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని కోరుతూ గ్రామ కమిటీ, ఎమ్మార్పీఎస్, అంబేద్కర్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో మంగళవారం రామాయంపేట – గజ్వేల్ ప్రధాన రహదారిపై 3 గంటల పాటు ధర్నా కార్యక్రమం చేస్తూ రోడ్డుపైబైఠాయించారు.ప్రభుత్వ పోలీసు, అధికారులు వెంటనే దుండగులను గుర్తించి వారిపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేసి అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేయాలని ద్వంసమైన వేలును మళ్ళీ అతికించాలని దళిత ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.