Monday , September 16 2024

ప్రజా సమస్యల కొరకు ప్రశ్నించినందుకు గత తెరాస ప్రభుత్వంలో కుట్రపూరితంగా పెట్టిన కేసులకు కోర్టులో పరిగి యూత్ కాంగ్రెస్ నాయకులు ఈరోజు హాజరు కావడం జరిగింది

తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా పరిగి ప్రతినిధి 15

పరిధిలో గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజా సమస్యలపై ప్రజల కొరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాడుతున్న సమయంలో కేసీఆర్ ప్రభుత్వం దళిత బంధు పథకం నిర్వహించినందున నిజమైన లబ్ధిదారులకు చేకూరాలని గత సంవత్సరంలో ఎన్నో ఉద్యమాలు చేసినప్పటికీ ప్రభుత్వం వినకపోవడంతో మాజీ మంత్రి హరీష్ రావు గారిని కలిసి విన్నవించేందుకు వెళితే అప్పుడు పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి కేసులు బనాయించడం జరిగింది. ఆ కేసుకు సంబంధించి ఈరోజు పరిగి కోర్టులో హాజరు కావడం జరిగింది, ఇంకా పదుల సంఖ్యలో కేసులు బనాయించడం జరిగింది టిఆర్ఎస్ ప్రభుత్వం. మా పోరాటం మా కష్టం ప్రజల ఆశీర్వాదం నెరవేరింది, మా కళలు సహకారం అయ్యాయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ప్రజలకు మంచి జరుగుతుంది ఇప్పుడు ఆనందంతో ప్రజలు ఉన్నారు అని యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగవర్ధన్ అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి మహేష్, కాంగ్రెస్ దోమ మండల అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి ,మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు శ్రీశైలం ఉన్నారు…