Wednesday , July 24 2024

రైతులు రోడ్లపై వరి ధాన్యాన్ని పోస్తే కఠిన చర్యలు.

రామాయంపేట ఎస్ ఐ రంజిత్ కుమార్.

తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి ఏప్రిల్ 11:

రైతులు వారి పొలాలు కోసిన తర్వాత ధాన్యాన్ని నిర్లక్ష్యంగా రోడ్ల పై పోయటం వలన, రోడ్డు పై వాహనాల్లో వెళ్లేవాళ్లు ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం ఉంటుందని రామాయంపేట ఎస్ ఐ రంజిత్ కుమార్ రైతులకు సూచించారు.దయచేసి రైతులు రోడ్ల పైన వరి ధాన్యాన్ని చేయకూడదని పోలీస్ శాఖ తరపున విజ్ఞప్తి చేశారు.