Sunday , May 26 2024

ప్రశాంతంగా ఎస్పీ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం.

ఫిర్యాదులు రాగానే పోలీస్ స్టేషన్లో వెంటనే చర్యలు చేపట్టాలి.

జిల్లా ఎస్పీ డాక్టర్ బాలస్వామి.

తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి ఫిబ్రవరి 26:

మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ డాక్టర్.బాలస్వామి ఆద్వర్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు పలు సూచనలు చేయడమైనది. ఈ కార్యక్రమంలో చేగుంట మండలం పెద్ద శివునుర్ గ్రామానికి చెందిన మనెగల్ల ప్రియాంక ఫిర్యాదు ప్రకారం అదే గ్రామంలో వీఆర్ఏ గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి కొద్ది రోజుల క్రితం మైనరుగా ఉన్న తన చెల్లి పెళ్లి చేసి కళ్యాణలక్ష్మి లబ్ది పొందుటకి తప్పుడు దృవపత్రాలను సృష్టించినాడని అట్టి విషయమై పై అధికారులకి నా భర్త ఫిర్యాదు చేయగా, విచారణలో అవి తప్పుగా సృష్టించిన పత్రాలుగా నిరూపణ కాగా, ఈ విషయాలు మనసులో పెట్టుకొని నా భర్తను ఎన్ని రోజులైనా విడువను నీ సంగతి చూస్తాను అంటూ భయబ్రాంతులకిగురిచేస్తున్నారని,అతని వల్ల నా భర్తకు ప్రాణ భయం ఉందని కావున తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేయగా చట్టప్రకారం ఫిర్యాదికి తగిన న్యాయం చేయమని చేగుంట ఎస్.ఐ.కి తగు సూచనలు చేయటం జరిగింది.అలాగే మెదక్ కి చెందిన సార లక్ష్మి భర్త/కీ.శే.మోహన్ రాజ్ నా భర్త మరణాంతరం వారు లేని సమయం చూసి తన భర్తకి వారసత్వంగా రావలసిన ఆస్తిని తన భర్త అన్న అయిన శ్యాంసుందర్ పేరుపైకి తమ ప్రమేయం లేకుండా అక్రమంగా మార్చుకున్నారని కావున న్యాయం చేయాలని కోరగా చట్టప్రకారం ఫిర్యాదికి తగిన న్యాయం చేయమని మెదక్ సి.ఐ.కి తగు సూచనలు చేయటం జరిగింది.