Monday , September 16 2024

మెదక్ పార్లమెంట్ స్థాయిలో బూతుల యొక్క అధ్యక్ష, కార్యదర్శులు, కోఆర్డినేటర్లు, బి ఎల్ ఓ లకు సమావేశం.

తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి ఏప్రిల్ 10:

మెదక్ పార్లమెంటు స్థాయిలో మెదక్ పార్లమెంట్ లో ఉన్నటువంటి 2,156 పోలింగ్ బూతుల యొక్క అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, కోఆర్డినేటర్, బిఎల్ఎ లు వీరందరితో కలిపి గురువారం సాయంత్రము మెదక్ పట్టణంలోని చిల్డ్రన్స్ పార్కులో సమావేశము ఏర్పాటు చేయడానికి నిర్ణయించాము. గురువారం సాయంత్రం ఐదు గంటలకు మెదక్ పట్టణంలోని చిల్డ్రన్స్ పార్క్ లో ఈ సమావేశం జరగబోతోంది. ముఖ్యంగా బూత్ స్థాయిలో పోలింగ్ బూత్ స్థాయిలో కార్యకర్తలు ఏ విధంగా పని చేయాలి? రానున్న ఎన్నికల్లో ఏవిధంగా ముందుకు వెళ్లాలి బిజెపి అభ్యర్థికి ఓటు ఎందుకు వేయాలి బి ఆర్ ఎస్ కు ఎందుకు వేయద్దు, కాంగ్రెస్ కు ఎందుకు వేయొద్దు అని చెప్పడానికి బూతు స్థాయి ముఖ్య నాయకుల యొక్క సమావేశము జరగబోతోంది. పార్లమెంట్ లోని మూడు జిల్లాలు 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు అందరూ కూడా రాబోతున్నారు ఇట్టి కార్యక్రమానికి మెదక్ పార్లమెంటు అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు తో పాటు మాజీ మంత్రి ఈటల రాజేందర్, కూడా రానున్నారు. కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతారు. కార్యకర్తలు ఏ విధంగా వారి వారి యొక్క పోలింగ్ బూత్ లో పనిచేయాలి వచ్చేనెల 13వ తేదీ వరకు ఏ విధంగా జాగ్రత్తలు వహించాలి కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ మోసపూరితమైనటువంటి ఎత్తుగదలతోపాటు విచ్చలవిడిగా డబ్బులను మద్యాన్ని పంపే ప్రయత్నం కూడా చేయబోతుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తావున్నది మీరు చూశారు మొన్నటి రోజున సిద్దిపేటలో టిఆర్ఎస్ అభ్యర్థి మరి ఇంకా అతను కలెక్టర్గ గా ఉన్న అనుకుంటున్నాడా మరి రాజకీయంలోకి వచ్చిన అనుకుంటున్నాడా అది అర్థం కావట్లేదు ప్రభుత్వ ఉద్యోగులను సమావేశం ఏర్పాటు చేసి వాళ్లకు కూడా ఇబ్బందికి కావడానికి కారకులైనటువంటి టిఆర్ఎస్ అభ్యర్థి మీద కూడా చర్యలు తీసుకోవాలని మేము ఈసీకి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది ఎలక్షన్లో అయ్యేటంతవరకు కూడా ఎవరి పోలింగ్ బూత్ పరిధిలో వారు పని చేయాలి. పోలింగ్ బూతుల లో కార్యకర్తలు అందరూ కూడా వారిగా పన్నా ప్రముఖ్ ల వారిగా ఇళ్లవారిగా డివైడ్ చేసుకొని ఆయా ఇంటికి వెళ్లి ఆ ఓటర్ను కలిసి నరేంద్ర మోడీని మూడోసారి ప్రధానమంత్రి కావడానికి పనిచేయాలని చెప్పాలి. పదకొండవ స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని ప్రపంచంలో 5 ఐదో స్థానానికి రావడం నరేంద్ర మోడీ నాయకత్వం వల్ల జరిగింది. మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మూడోసారి ప్రధానమైతే అయితే మరి ఐదవ స్థానం నుంచి ప్రపంచంలో మూడవ స్థానానికి తీసుకరావడానికి ప్రయత్నం చేస్తారు వికసిత భారత్ సంకల్పము ఏదైతే లక్ష్యంగా ఉందో 2047 వరకు రాబోయే రోజుల్లో విశ్వ గురువుగా ప్రపంచంలోనే నంబర్ వన్ దేశంగా భారతదేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి కంకణ బద్ధులై నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారు. దీనికై సన్నాహక సమావేశము రేపు సాయంత్రం 5 గంటలకు మెదక్ పట్టణంలోని చిల్డ్రన్స్ పార్క్ లో జరగబోతా ఉన్నది దీనికి అందరూ కూడా రావాలని బిజెపి నాయకులు కోరారు.