Sunday , May 26 2024

ఏప్రిల్ 11వ తేదీన మహాత్మ జ్యోతిబాపూలే 197వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి.

మహాత్మ సావిత్రిబాయి పూలే రాష్ట్ర కార్యదర్శి పోచమ్మల అశ్విని శ్రీనివాస్, మెదక్ నియోజకవర్గ లంబాడి హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు.

తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి ఏప్రిల్ 10:

మహాత్మా జ్యోతిబాపూలే 197వ జయంతి కార్యక్రమాన్ని రామాయంపేటలోని పూలే విగ్రహాల వద్ద అన్ని కుల సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు పాల్గొని పూలే విగ్రహాల వద్ద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని మహాత్మా జ్యోతిబాపూలే రాష్ట్ర కార్యదర్శి పోచమ్మల అశ్విని శ్రీనివాస్, మెదక్ నియోజకవర్గ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ లంబాడి సురేష్ నాయక్ కోరారు. ప్రతి ఒక్కరూ గురువారం ఉదయం 10 గంటల సమయంలో పూలే విగ్రహాల వద్దకు చేరుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. మన జాతికి చదువుల తల్లి జ్యోతిబాపూలే కుటుంబమని వారన్నారు.