తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి ఏప్రిల్ 10:
పై ఫోటోలోని పాప మెదక్ జిల్లా రామయంపేట్ మార్కెట్ వద్ద ఏడుస్తూ కనిపించింది. బహుశా ఆమె తల్లిదండ్రులు మార్కెట్ కి వచ్చి, ఈమెను గమనించకుండా వెళ్లిపోయినట్టుగా అనిపిస్తుంది. దయచేసి ఈ పాప యొక్క ఫోటోను వారి తల్లిదండ్రులకు చేరేవరకు ఫార్వర్డ్ చేయగలరు. ప్రస్తుతం పాప రామాయంపేట పోలీస్ స్టేషన్ వద్ద ఉందని మెదక్ జిల్లా రామాయంపేట ఎస్ ఐ రంజిత్ కుమార్ తెలిపారు. వివరాలు తెలిస్తే పోలీస్ స్టేషన్కు వచ్చి పాపను తీసుకువెళ్లాలని ఆయన కోరారు.