Tuesday , July 16 2024

ప్రభుత్వ ఆసుపత్రిలో స్నేహబంధు ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం.

తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి ఏప్రిల్ 10:

మెదక్ జిల్లా రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పేద రోగులకు ఉపయోగపడే విధంగా లయన్స్ క్లబ్ ఆఫ్ రామాయంపేట స్నేహబంధు ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ లింబాద్రి మాట్లాడుతూ రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో టైఫాయిడ్ జ్వరానికి సంబంధించిన లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ చాలా ఉన్నాయని పేర్కొన్నారు ఎవరికి అవసరం ఉన్నా వచ్చి ట్రీట్మెంట్ తీసుకోగలరని కోరారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ రామాయంపేట స్నేహబంధు కోశాధికారి గడ్డం గంగారం, డిసీలు బాదే గురువయ్య,ఉలిసె దామోదర్ రావు, కందిమల్ల శ్రీనివాసరావు, ఎం. దీప్ చంద్, సతీష్ రావు, లక్ష్మణాచారి, జోన్ చైర్మన్ ఐరేని రవీందర్ గౌడ్, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.