Wednesday , September 18 2024

తొనిగండ్లలో ఘనంగా ఉగాది ఉత్సవాలు.

గ్రామ దేవతలకు బండ ఊరేగింపు.

తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి ఏప్రిల్ 9:

మెదక్ జిల్లా రామాయంపేట మండలం తొనిగండ్ల గ్రామంలో అంగరంగ వైభవంగా ముదిరాజు సంగం తరఫున కొల్లారి బండి, మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో బండ్ల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయం, ముత్యాలమ్మ, నల్ల పోచమ్మ, దుర్గమ్మ దేవతలతో పాటు పలు దేవాలయాల చుట్టూ బండ ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకుడు, మున్నూరు కాపు సంఘం నాయకులు,మహిళలు, చిన్నపిల్లలు ఆనందోత్సవాల మధ్య ఉగాది సంబరాలను జరుపుకున్నారు.ఉదయం నుండి ఉగాది సంబరాలు జరిపారు.నూతన వస్త్రాలు ధరించి, పిండి వంటలు నిర్వహించారు. అనంతరం బండ్ల ఊరేగింపు జరిగింది. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు బోయిని రాజయ్య, ఉపాధ్యక్షుడు పిట్ల పెద్ద రాజయ్య, మాజీ సర్పంచ్ పిట్ట రాణమ్మ భూలింగం, యువత సంఘం నాయకులు పిట్ల రాజు, బోయిని వెంకట సాయి కుమార్, పిట్ల శ్రావణ్ కుమార్, పిట్ల అజయ్ కుమార్, పిట్ల మహేష్, పిట్ల రాజు, బోయిని సత్తయ్య, శ్యామయ్య, పిట్ల చిన్న రాజయ్య, పోచయ్య, లచ్చయ్య, శ్రీనివాస్, సిద్ధరాములు, అమ్మన్నగారి సిద్దయ్య, మల్లేశం, అమ్మగారి కిషన్, అమ్మన గారి బాలయ్య, అమ్మనగారి వెంకటయ్య, మల్లన్న గారి గంగారాములు, మల్లన్న గారి శ్రీనివాస్, మల్లన్న గారి ఆంజనేయులు, మల్లన్న గారి అరుణ్ తదితరులు పాల్గొన్నారు.