మంచిగా చదివి ఉన్నత శిఖరాలను ఎదగాలి.
రామాయంపేట సిఐ వెంకటేష్, ఎస్ ఐ రంజిత్ లో విద్యార్థులకు సూచించారు.
తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి ఫిబ్రవరి 25:
ఇంటర్మీడియట్ విద్యార్థులకు జీవితం మలుపు తిరుగుతుందని రామాయంపేట పోలీస్ సిఐ వెంకటేష్, ఎస్ ఐ రంజిత్ లు అన్నారు. ఆదివారం స్నేహ విద్యాసంస్థల వీడ్కోలు సమావేశం స్థానిక శ్రీకర ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్నేహ కళాశాల కరస్పాండెంట్ లయన్ వెలిశెట్టి సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామాయంపేట మండలంలోని స్నేహ జూనియర్ కళాశాలలో వీడిపోలు సమావేశం శ్రీకర ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చిన రామాయంపేట పోలీస్ సిఐ వెంకటేష్, ఎస్ ఐ రంజిత్ లు మాట్లాడుతూ ఎస్ ఐ రంజిత్ సమావేశానికి గెస్ట్అఫ్ ఓనర్గా పాల్గొన్నారు. వీరు మాట్లాడుతూ విద్యార్థులకు జీవితంలో ఎదుగుదలకు ఉపయోగపడే సూచనలను వారు విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ వి ఎన్ చారి, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు ఆటపాటలతో, ఆనందోత్సవాల మధ్య గడిపారు.