Wednesday , July 24 2024

నీలం మధును కలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.

తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి మార్చి 28:

మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజును రామాయంపేట పట్టణ ముదిరాజ్ నాయకులు ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. నీలం మధును గెలిపించడం కోసం తాము కృషిచేసి గెలిపించుకుంటామని వారన్నారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట పట్టణ మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు డాకి స్వామి, ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుట్టి అక్షయ్ కుమార్ తోపాటు మరింత మంది ముదిరాజులు పాల్గొని ఎలాంటి పరిస్థితుల్లో అయినా గెలిపిస్తామని ఆయనకు భరోసా ఇచ్చారు.