Wednesday , July 24 2024

అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్.

జిల్లా ఎస్.పి డాక్టర్. బాలస్వామి.

తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి మార్చి 28:

గురువారం తూప్రాన్ డి.ఎస్.పి ఆఫీసులో నిర్వహించిన మీడియా సమావేశం లో మెదక్ జిల్లా ఎస్.పి డా. బి.బాలస్వామి.మాట్లాడుతూ.హైదరాబాద్ ఈఎస్ఐ కి చెందిన ఉప్పల శ్వేత తేదీ 26.02.2024 నాడు రాత్రి 08:00 గంటలకు తూప్రాన్ లో గల మా బంధువుల హల్దీ ఫంక్షన్ కి వచ్చి తిరిగి తేదీ 27.02.2024 నాడు మధ్యాహ్నం 01:40 నిమిషాలకు మా ఆడపడుచు విశాలతో కలిసి హైదరాబాద్ వెళ్ళుటకు తూప్రాన్ బస్టాండ్ కి వచ్చి బస్సు కోసం కూర్చున్నాం మేము వచ్చాక అరగంటకు మెట్రో ఎక్స్ప్రెస్ రాణిగంజ్ డిపో బస్సు నంబర్ ఏపీ 29 జెడ్ 3927 గల బస్సు రాగా అట్టి బస్సులో ఎక్కి తూప్రాన్ టోల్గేట్ వరకు వెళ్లగానే నేను ముఖంకు స్కార్ఫ్ కట్టుకోవడానికి బ్యాగ్ జిప్ తీయగా బ్యాగ్ లో పెట్టిన 12.5 బంగారం లాంగ్ చైన్, పులిగోరు, ఒక జత కమ్మలు, చెంప స్వరాలు కనబడలేదు వెంటనే నేను చుట్టుపక్కల అంత వెతికిన నా యొక్క బంగారం కనలేదు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి నా యొక్క బంగారం దొంగిలించిపోయినారు కావున నా బంగారు వస్తువులు ఎవరో గుర్తులెం దొంగిలించి పోయినందుకు వారిపై చట్టరితే చర్య తీసుకొని నాకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేయగా అట్టి కేసును ఛాలెంజ్ గా తీసుకుని కేసు నమోదు చేసి తూప్రాన్ డి.ఎస్.పి.శ్రీ.వెంకట్ రెడ్డి గారి ఆద్వర్యంలో 2 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీఐ తూప్రాన్ , ఎస్‌ఐ తూప్రాన్ గార్లు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఒక ప్రాథమిక అంచనాకు కొందరు దొంగలు వచ్చి చోరీకి పాల్పడినట్లు గుర్తించారని వెంటనే నిందితులను పట్టుకోవటానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని సీఐ తూప్రాన్ , ఎస్‌ఐ తూప్రాన్ సిబ్బందితో తూప్రాన్ ధాబ ల వద్ద వాహనాల తనికి చేస్తుండగా కొందరు అనుమానితులను పట్టుకొని విచారించగా తామే ఈ దొంగతనం చేసినామని ఒప్పుకున్నారని తెలిపినారు. వారిని విచారించగా తాము పని చేసిన డబ్బులు సరిపోయేవి కావని తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో 5 మంది కలిసి దొంగతనం చేయాలి అని అనుకున్నారని 5 మంది కలిసి దొంతనాలు చేయడం ప్రారంబినారని హిన, వైశాలి, జయశ్రీ ముగ్గురు ఆడవారు కలిసి రద్దీ ప్రదేశం లో బంగారు వస్తువులు కలిగిన ఉన్న ఆడవారిని గుర్తించి, వారి బ్యాగు లో ఉన్న బంగారు ఆభరణాలను చాకచక్యంగా వారికి తెలువకుండా దొంగతనం చేయడం చేసేవారని వీరు అనేక చోట్ల ఇలాగే దొంగతనాలు చేసినారని తెలిపినారు. అలాగే ఈ కేసును చాకచక్యంగా వ్యూహాత్మకంగా ఛేదించిన సిబ్బందిని క్యాష్ రివార్డ్ తో జిల్లా ఎస్.పి డా. శ్రీ.బి.బాలస్వామి ఐ.పి.ఎస్. గారు అబినందించడం జరిగింది.
నేరస్తుల వివరాలు:

 1. వైశాలి విజయ్ సోలంకే @ సునీత W/o విజయ్ సోలంకే, వయస్సు: 49 సంవత్సరాలు, కులం: గిసిడి, Occ: కుల వృత్తి , R/o కోర్ట్ రోడ్ అశోక్ లాడ్జ్ కాలనీ మజల్‌గావ్, బీడ్ జిల్లా, మహారాష్ట
  1. హీనా కరణ్ రహాడే W/o కరణ్ రహాడే, వయస్సు: 21 సంవత్సరాలు, కులం: మరాటా, Occ: గృహిణి R/o రుయి, TQ జియోరాయ్, జిల్లా బీడ్, మహారాష్ట
 2. జయశ్రీ అంకుష్ సోలంకే W/o అంకుష్ సోలంకే, వయస్సు: 32 సంవత్సరాలు, కులం: గిసిడి, Occ: కుల వృత్తి, R/o శివాజీనగర్, జియోరై TQ, బీడ్ జిల్లా, మహారాష్ట
 3. విజయ్ భీమ్‌రావ్ సోలంకే S/o భీమ్‌రావ్, వయస్సు: 39 సంవత్సరాలు, కులం: గిసిడి, Occ: కుల వృత్తి, R/o సిద్దిక్ కాలనీ, బీమ్‌రావ్ నగర్, మజగావ్ TQ, బీడ్ జిల్లా,మహారాష్ట
 4. కరణ్ సంతోష్ రహాడే S/o సంతోష్ రహాడే, వయస్సు: 24 సంవత్సరాలు, కులం: మరాటా, Occ: డ్రైవర్, r/o జియోరై , బీడ్ జిల్లా,మహారాష్ట
  స్వాధీన పరచుకున్న సొత్తు
  లాంగ్ చైన్, పులిగోరు, ఒక జత కమ్మలు, చైన్, చెంప స్వరాలు, 06 మొబైల్ ఫోన్లు
  ఒక వ్యాగనార్ కార్ (MH 23BH 1608)
  కేసు ఛేదించిన సిబ్బంది వివరాలు
  1.తూప్రాన్ డి.ఎస్.పివెంకట్ రెడ్డి, తూప్రాన్ సి ఐ కృష్ణ, తూప్రాన్ ఎస్ ఐ శివానందం,కానిస్టేబుళ్లు గోవర్దన్, నాగేంద్రబాబు, వెంకట్, సురేష్, కృష్ణ ను జిల్లా ఎస్.పి డాక్టర్.బాలస్వామి అబినందిచి క్యాష్ రివార్డ్ లను ఇవ్వడం జరిగింది.