Wednesday , July 24 2024

పదవ తరగతి పరీక్షలు ఎలాంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా ప్రారంభం.

జిల్లా విద్యాశాఖ అధికారి రాధా కిషన్ తెలిపారు.

తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి మార్చి 18:

మెదక్ జిల్లాలో ఎస్.ఎస్.సి. పబ్లిక్ పరీక్షలు మార్చ్, 2024 తేది: 18-03-2024 రోజున ఏ విధమైన సమస్యలు లేకుండా ప్రశాంతంగా ప్రారంభమైనవి. జిల్లా నందు (68) పరీక్షా కేంద్రాలలో (10,298) మంది రెగ్యులర్ విద్యార్థులకు గాను (10,270) మంది విద్యార్థులకు హాజరైనారు. కేవలం (28) విద్యార్దులు గైర్హాజరు అయ్యారు.(05) ప్రైవేట్ విద్యార్ధులకు గాను (04) హాజరైనారు. కేవలం (01) ఒక విద్యార్థి గైర్హాజరు అయినారు. మొదటి రోజు పరీక్ష సజావుగా సాగిందని జిల్లా విద్యాశాఖాధికారి
రాదాకిషన్ ఒక ప్రకటనలో తెలిపారు.