జిల్లా ఎస్పీ డాక్టర్. బాలస్వామి.
తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి మార్చి 18:
మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ డాక్టర్. బాలస్వామి ఆదేశానుసారం ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా అదనపు ఎస్.పి అడ్మిన్ మహేందర్ నిర్వహించడం జరిగింది. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు పలు సూచనలు చేయడమైనది. ఈ కార్యక్రమంలో తూప్రాన్ మండలం పోతరాజుపల్లి గ్రామానికి చెందిన గౌనిబాటి రుక్కమ్మ తనను తూప్రాన్ మండలం మల్కాపూర్ గ్రామ వాసులైన బట్టిగాడి స్వామి గౌడ్ అని వ్యక్తి నమ్మించి నాకు మాయ మాటలు చెప్పి మోసం చేసి గ్రామ నివాసుడు పోతిరెడ్డి పాపిరెడ్డి అనే వ్యక్తిని జామిన్ గా పెట్టి మల్కాపూర్ గ్రామ శివారులో గల సర్వే నెంబరు 335/ఆ సర్వే నెంబర్, 33/ ఈ సర్వే నంబర్, 33 బై 33/అ గల విస్తీర్ణంలో 33 గుంటల వరకు ఖరీదుకు తీసుకున్నారని జిరాక్స్ కాగితాలు పెట్టి నా నుండి 3 లక్షల రూపాయలు తీసుకొని అట్టి భూమిని నాకు ఇప్పిస్తానని మోసం చేసినాడు నా డబ్బులు నాకు ఇవ్వమన్నా ఇవ్వకుండా తిరిగి నన్ను బూతు మాటలు తిడుతూ చంపుతానని బెదిరిస్తున్నాడు అట్టి వ్యక్తి నుండి నాకు ప్రాణహాని ఉన్నది కావున పైన తెలిపిన వారిపై చట్టపరమైన చర్య తీసుకుని తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేయగా చట్టప్రకారం ఫిర్యాదికి తగిన న్యాయం చేయమని తూప్రాన్ ఎస్.ఐ. గారికి సూచనలు చేయటం జరిగింది. అలాగే రామాయంపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన గుర్రం స్రవంతి నన్ను ధర్మారం గ్రామనికి చెందిన నక్కని రాకేష్ అను అబ్బాయి 2021 నుండి నన్ను ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు దానికి నేను అంగీకరించకపోవడంతో చనిపోతాయని బెదిరించాడు తన బెదిరింపును చూసి అతని ప్రేమను ఒప్పుకున్నాను ఆ తర్వాత అతను కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు గత నాలుగు నెలల నుంచి నన్ను వద్దు అంటున్నాడు ఇప్పుడు పెళ్లికొప్పుకోవడం లేదు కావున తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేయగా చట్టప్రకారం ఫిర్యాదికి తగిన న్యాయం చేయమని రామాయంపేట ఎస్.ఐ.కి సూచనలు చేయటం జరిగింది.