తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి మార్చి 18:
పార్లమెంట్ ఎన్నికలు 2024 ఎన్నికల నియమావళి లో భాగంగా సోమవారం కలెక్టరు కార్యలయం లో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ /ఏం సి ఏం సి మీడియా సెంటర్ ను జిల్లాఎస్పిబాలస్వామి ,అదనపు కలెక్టర్ వేంకటేశ్వర్లులతో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు .
ఎన్నికల్లో కాల్ సెంటర్ లో వచ్చే పిర్యాదులు,లోకల్ ఛానల్ ప్రసారాలు,ఎన్నికల ప్రకటనలు,
చెక్ పోస్టుల వద్ద ఏర్పాటుచేసిన సి సి కెమెరాల రికార్డింగ్ ల ఏర్పాట్లను పరిశీలించారు.టోల్ ఫ్రీ నంబర్ 1950 లో వచ్చిన పిర్యాదులు,సి విజిల్ లో వచ్చిన పిర్యాదులు ,వాటి పరిష్కారాలు, ఎస్ ఎస్ టి, ఎఫ్ ఎస్ టి టీమ్ పనితీరు,
మీడియాలో వచ్చే వార్తలు, పేడ్ న్యూస్ ,పత్రికాప్రకటనలు , ఎలక్ట్రానిక్ మీడియా రికార్డింగ్ లను ఎలా రికార్డ్ చేయాలో సిబ్బందికి వివరించారు.
ఈ కార్యక్రమం లో నోడల్ అధికారులు ,ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.