Sunday , May 26 2024

మెదక్ జిల్లాలో వడగళ్ల వాన ఈదురు గాలులు.

భారీగా నష్టపోయిన రైతులు.

తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి మార్చి 18:

సోమవారం మెదక్ జిల్లా లోని పలు మండలలో వడగండ్ల వాన,భారీగా ఈదురు గాలులతో వర్షం కురిసింది. జిల్లాలోని చేగుంట, చిన్న శంకరంపేట, వెల్దుర్తి, నర్సాపూర్, శివంపేట, తూప్రాన్, మనోహరాబాద్, నార్సింగి, రామాయంపేట, నిజాంపేట మండల తో పాటు ఇతర మండలాలలో ఈదురుగాలులతో కూడిన వర్షం వడగండ్ల వాన కురవడం జరిగింది. దీంతో మామిడికాయలు రాలిపోయాయి.వరి పంట నేలకొరిగింది. వడగండ్ల వర్షం వల్ల వడ్లు ర్యాలీ నేలపాలయ్యాయి. రేకుల ఇల్లు సైతం రేకులు లేచిపోయి అనేక నష్టం జరిగింది.