Friday , October 4 2024

సమస్యల పరిష్కారానికి నేరుగా ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి చెప్పుకోవాలి.

అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు రమేష్.

ప్రజావాణి కార్యక్రమానికి 73 ఆర్జీలు.

తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి మార్చి18:

సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా కలెక్టర్ కార్యాలయంలో జిల్లాఅదనపు కలెక్టర్ రమేష్ వివిధ సమస్యలపై ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు రమేష్ మాట్లాడుతూ ప్రతి సోమవారం ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించడానికి ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి నేరుగా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి చెప్పుకోవాలి కానీ ఇతరుల మీదఆధారపడరాదని సూచించారు.ధరణి భూ సమస్యల గురించి 33,పెన్షన్ కోసం 4,ఉఫాది,3 ఇతర సమస్యల గురించి 33 మంది నుంచి ఆర్జిలు స్వీకరించమని, తెలిపారు. వివిధ సమస్యలపై ప్రజలు పెట్టుకున్న అర్జీలను వాటి పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జెడ్పి సీఈఓ ఎల్లయ్య, ఆర్డీవో పద్మాశ్రీ ,వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గోన్నారు.