Tuesday , July 16 2024

పార్లమెంటు ఎన్నికల కోసం కౌంటింగ్ సెంటర్,స్ట్రాంగ్ రూం ల పరిశీలన.

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి మార్చి 15:

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలోమెదక్ జిల్లాలో ఉన్న నర్సాపూర్ నియోజకవర్గం లో బీవీ ఆర్ ఐ టి ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్,స్ట్రాంగ్ రూంలను శుక్రవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం సూచనలతో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ కోసం బీవీఆర్ఐటి ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ సెంటర్, స్ట్రాంగ్ రూంలను పరిశీలించడం జరిగిందన్నారు.
పార్లమెంట్ ఎన్నికల కోసం నర్సాపూర్ నియోజకవర్గంలో ఉన్న బి వి ఆర్ ఐ టి కళాశాలలో 5 సెగ్మెంట్ లకు కౌంటింగ్ సెంటర్, ఒక పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ సెంటర్ ను ,ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాల లో 2 సెగ్మెంట్ లకు కౌంటింగ్ సెంటర్ లను ఏర్పాటు దిశగా ఏర్పాట్లు చేస్తున్నామని, కౌంటింగ్ సెంటర్,స్ట్రాంగ్ రూంలలో ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలోనర్సాపూర్ ఆర్డీఓ శ్రీనివాసులు,తహశీల్దార్ కమలద్రి, బి.వి.ఆర్.ఐ.టి కళాశాల ప్రిన్సిపాల్ బాపిరాజు,ట్రైబల్ వెల్ఫేర్ కళాశాల ప్రిన్సిపాల్ బిక్షపతి,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.