Wednesday , September 18 2024

ఘట్కేసర్ కొండాపూర్లో మట్టి మాఫియామామూళ్ల మత్తులో అధికారులు

మేడ్చల్ జిల్లా/ఘట్కేసర్ తెలంగాణ కెరటం

కొండాపూర్ ప్రాంతానికి చెందిన సర్వేనెంబర్ 288,289 గల ప్రభుత్వ భూమిలో భారీ ఎత్తున మైనింగ్ మాఫియా కొండలను సైతం పిండి చేస్తూ కోట్లు దండుకుంటున్న వైనం


ఇక్కడ జరుగుతున్న మైనింగ్ మాఫియా స్థానిక అధికారులకు సమాచారం లేదంటారా??
లేదా తెలిసి కూడా చోద్యం చూస్తున్నారా??
మరి తెలిస్తే నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంపై పలు అనుమానాలకు తావిస్తోంది
భారీ ఎత్తున అధికారులకు ముడుపూలు ముట్టాయా….??
మరి ఇంత నిర్భయంగా మట్టి మాఫియా చేస్తున్న ఆగడాలు చూస్తుంటే నిజమే ఆరోపణలు వినిపిస్తున్నాయి
అందుకే అధికారుల సహకారంతోనే ప్రభుత్వ భూములలో లేఔట్లు చేసి నిర్మాణాలు చేపట్టి ప్లాట్లు చేసి అమాయకమైన పేద ప్రజలకు విక్రయిస్తూ కబ్జాలకు పాల్పడుతున్నార
భూ కబ్జాలకు పాల్పడుతూ ప్రభుత్వ అధికారులకు సవాలు విసురుతున్న కబ్జా రాయుళ్లపై సంబంధిత ఉన్నంతధికారులు వెంటనే వారిపై చట్టరీత్యమైన చర్యలు తీసుకొని
ప్రభుత్వ భూములను పరిరక్షించాలని స్థానిక ప్రజా సంఘాలు స్థానిక ప్రజలు కోరుతున్నారు