Saturday , October 12 2024

మర్పల్లి లో  ఇంటర్ సిటీ ట్రైన్  నిలపడం తో హర్షం వ్యక్తం  చేసిన మండల బీజేపీ  నాయకులు..???

తెలంగాణ కెరటం, వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం ప్రతినిధి మే

మర్పల్లి  రైల్వే స్టేషను లో ఈ నేల 9 నుంచి  బీదర్ హైదరాబాద్ ఇంటర్సిటీ రైలునిలుపుదలకు రైల్వే అధికారులు చర్యలు తీసుకోవడంతో మండల బిజెపి నాయకులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు  మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ  గతంలో అనేకసార్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కుమార్ గారికి మరియు అలాగే రైల్వే బోర్డు   మెంబర్ జి ఉమారాణి గారికి  ట్రైన్ నిలుపుదలకు గురించి వినతి పత్రాలు ఇవ్వడంతో వారు  ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు ట్రైన్ నిలుపుదల కొరకు చర్యలు తీసుకొని అధికారులకు ఆదేశాలు ఇచ్చినందున  రైల్వే మంత్రిగారికి మరియు రైల్వే అధికారులకు తెలియపరచిన మాజీ మంత్రివర్యులు డాక్టర్ ఏ చంద్రశేఖర్ గారికి దాన్యవాదలు  తెలిపారు.మండల ప్రజానీకం మరియు పరిసరా వాసులు అందరు హైదరాబాద్
వేళ్ళేందుకు రైలు సౌకర్యం వినియోగించుకోవాలని  వారు  కోరారు..